‘బీజేపీ తెలంగాణ ద్రోహి’
కాంగ్రెస్ హయాంలో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి డజన్(12) కేంద్ర మంత్రులు ఉండగా.. తెలంగాణ ప్రాంతం నుంచి ముగ్గురు(3) కేంద్ర మంత్రులుండేవారని తెలిపారు. బీజేపీ ఉత్తర భారతం పార్టీ అని మరోసారి రుజువైందని ఆయన విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలపై పూర్తి నిర్లక్ష్యం వ్యవహారిస్తున్నారని బీజేపీ నుద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ- బీజేపీ శాఖ నుంచి కేంద్ర మంత్రులుగా పనిచేసేందుకు ఒక్కరు కూడా సమర్దులు లేరా ? అని సూటిగా అడిగారు.
విభజన హీమీలను(హైకోర్టు విభజన, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా..) అమలు చేయలేదు, ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చోటు కూడా లేదు.. తెలంగాణలో బీజేపీ నాయకులు ఏం మోహం పెట్టుకుని తిరుగుతారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఈ అవమానానికి బదులుగా రాబోయే ఎన్నికల్లో బీజేపీని పాతరేస్తారని అన్నారు.