ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం | By taking of Bribe caught to ACB | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

Published Fri, Jun 19 2015 2:02 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం - Sakshi

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

- లెసైన్స్‌ల రెన్యూవల్‌కు రూ. 3 లక్షల డిమాండ్
- డబ్బు తీసుకుని చిక్కిన గడ్డిఅన్నారం మార్కెట్ కార్యదర్శి
చైతన్యపురి:
లంచం తీసుకుంటూ మరో అవి నీతి తిమింగలం ఏసీబీకి పట్టుబడింది. ట్రేడ్‌లెసైన్స్‌ల రెన్యూవల్‌కు రూ. 3 లక్షల లంచం తీసుకుంటూ గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి (ఎస్‌జీఎస్) కార్యదర్శి  కె. జనార్దన్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా అవినీతిశాఖ అధికారులకు దొరికాడు. గురువారం రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్‌పీ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం... మార్కెట్‌లోని 122 కమీషన్ ఏజంట్ల లెసైన్స్‌ల కాలం 2013తో ముగిసింది.  2014 నుంచి 2018 వరకు రెన్యూవల్ చేయాల్సి ఉంది.  రెన్యూవల్ కోసం హోల్‌సేల్ కమీషన్ ఏజెంట్లంతా 2013లోనే చాలాన్లు చెల్లించారు.

ఎస్‌జీఎస్ జనార్దన్‌రెడ్డి లెసైన్స్‌లు రెన్యూవల్ చేయకుండా నిలిపివేశారు. దీంతో హోల్‌సేల్ ఫ్రూట్ కమిషన్ ఏజంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తాజుద్దీన్..రెన్యూవల్స్ కోసం లేఖ రాయగా.. అదనంగా ఒక్కో షాపుకు రూ.2500 ఇస్తేనే రెన్యూవల్ చేస్తానని స్పష్టం చేశారు. ముందు రెన్యూవల్ చేయండి.. తర్వాత డబ్బు ఇస్తామని తాజుద్దీన్ చెప్పడంతో 2014 ఆగస్టు నాటికి 116 షాపుల రెన్యూవల్ ్స పూర్తి చేసి మిగిలిన వాటిని రెన్యూవల్ చేయకుండా జనార్దన్‌రెడ్డి ఆపేశారు.

మిగిలిన షాపులకు రెన్యూవల్స్ పూర్తి చేయాలని ఫిబ్రవరి 2015న మళ్లీ అసోసియేషన్ తరఫున లేఖ రాయగా...  ఒప్పందం ప్రకారం తనకు లంచం డబ్బు చెల్లిస్తేనే రెన్యూవల్ చేస్తానని జనార్దన్‌రెడ్డి చెప్పాడు. దీంతో ఎస్‌జీఎస్ వైఖరితో విసుగెత్తిన తాజుద్దీన్  ఈనెల 16న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు జనార్దన్‌రెడ్డిని పట్టుకొనేందుకు పథకం వేశారు.
 
మూడు నెలల్లో రిటైర్ కావాల్సి ఉండగా..
 గడ్డిఅన్నారం మార్కెట్ ఎస్‌జీఎస్‌గా జనార్దన్‌రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టి గురువారానికి రెండేళ్లు పూర్తయింది. సెప్టెంబర్‌లో పదవీ విరమణ పొందాల్సి ఉన్న ఆయన ఏసీబీకి పట్టుబ డటం గమనార్హం. 2009లో ఇక్కడ పనిచేసిన ఎస్‌జీఎస్ విశ్వనాథం కూడా రూ.2.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.  అ ప్పుడు విశ్వనాథంను, ఇప్పుడు జనార్దన్‌రెడ్డిని పట్టించింది కూడా తాజుద్దీన్ కావటం విశేషం.
 
పట్టుపడిందిలా...
గురువారం ఉదయం 12 గంటలకు ఏసీబీ అధికారులు మార్కెట్ కార్యాలయం వద్ద కాపుకాశారు. 12.15 గంటలకు రూ. 3 లక్షలు తీసుకుని తాజుద్దీన్ ఎస్‌జీఎస్ జనార్దన్‌రెడ్డి దగ్గరకు వెళ్లాడు. ముసారంబాగ్‌కు చెందిన తాత్కాలిక డ్రైవర్ రవీందర్‌కుమార్ కారు నడుపుతుండగా వెనుక సీట్లో తాజుద్దీన్‌ను కూర్చోపెట్టుకుని జనార్దన్‌రెడ్డి కార్యాలయం నుంచి  మార్కెట్‌లో గల యార్డుల వద్దకు వెళ్లారు. మధ్యలో తాజుద్దీన్ దగ్గర నుంచి రూ.3 లక్షలు ముందు సీట్లో కూర్చున్న జనార్ధన్‌రెడ్డి తీసుకుని డ్రైవర్ చేతికి ఇచ్చాడు.

డ్రైవర్ ఆ డబ్బును తన షర్టులోపల పెట్టుకున్నాడు. ఏసీబీ అధికారులు కారును ఆపి జనార్దన్‌రెడ్డితో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లంచం డబ్బును స్వాధీనం చేసుకున్న ఏసీబీ డీఎస్‌పీ ప్రభాకర్ విచారణ అనంతరం జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు.  వరంగ ల్‌లోని జనార్దన్‌రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నట్లు డీఎస్‌పీ తెలిపారు.  డ్రైవర్ రవీందర్ పాత్రపై విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ దాడిలో  సీఐలు ఎస్.వెంకట్‌రెడ్డి, నాగేశ్వరరావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement