కోనరావుపేట: కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్ల శివారులో నిర్మాణంలో ఉన్న ఓ సెల్‌టవర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో సెల్‌టవర్ కింద భాగంలో ఉన్న కేబుల్ వైర్లు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ రాజ్‌కుమార్ గౌడ్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.