కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి చేరుకోవాల్సిన కేసీఆర్ మధ్యాహ్నం వస్తారని తెలిసింది. ఆదివారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ నుంచి యాదాద్రికి వెళ్లి మధ్యాహ్నం పెద్దపల్లికి వస్తారని అధికార వర్గాలు తెలిపాయి. యాదగిరిగుట్టలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం తిరిగి పెద్దపల్లి చేరుకుంటారు. అనంతరం పెద్దపల్లి, ధర్మారంలో జరిగే హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.