
సీఎం డైరైక్షన్‌తోనే టీజేఏసీ నిర్వీర్యం
ముఖ్యమంత్రి కేసీఆర్ డెరైక్షన్‌తోనే టీజేఏసీ నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె.నగేశ్ ....
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె.నగేశ్
గొల్లపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ డెరైక్షన్‌తోనే టీజేఏసీ నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె.నగేశ్ అన్నారు. గొల్లపల్లిలో శనివారం విలేకరులతో మాట్లాడారు. వివిధ పార్టీల జెండాలపై గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చడం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయూలనే కుట్ర అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఐకాస కీలకపాత్ర పోషించిందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఏనాడు కోదండరామ్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. ఇప్పుడు టీజేఏసీని బలహీనపర్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ డెరైక్షన్‌తోనే కొన్ని ఉద్యోగ సంఘాలు వైదొలిగాయన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఎల్లంకి రమేశ్, ఓరుగంటి జాన్ తదితరులు పాల్గొన్నారు