ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం కూడా వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా ఎర్రవల్లిలో
జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం కూడా వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా ఎర్రవల్లిలో తన ఫాంహౌస్‌కు వచ్చిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతూ అల్లం విత్తే పనులను, పంటలను పరిశీలించారు. అయితే వివిధ పత్రికల్లో సీఎంతో కలసిన స్టీఫెన్‌సన్ ఫొటోలు రావడంతో ఫాంహౌస్ వద్ద మరింత భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
అటు వైపు వెళ్లేవారి పూర్తి వివరాలతో పాటు ఫోన్ నంబర్లను సేకరిస్తూ పంపిస్తున్నారు. శివారు వెంకటాపూర్, వర్ధరాజ్‌పూర్ వెళ్లేవారిని గంగాపూర్, యూసుఫ్‌ఖాన్‌పల్లి, ఎర్రవల్లి మీదుగా దారి మళ్లించారు. ఫాంహౌస్ పక్క నుంచి ఎవరినీ పంపించడం లేదు. అలాగే ప్రైవేట్ మినీ బస్సుల అసోసియేషన్ రాష్ట్ర నేతలు సీఎంను కలవడానికి ఫాంహౌస్‌కు వస్తుండగా వెంకటాపూర్ శివారులోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు వెనుదిరిగారు. కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.