
రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ సమాధానం: ఈటెల
అసెంబ్లీలో స్నేహపూర్వక వాతావరణాన్ని చెడగొడుతున్నారని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సభలో స్నేహపూర్వక వాతావరణాన్ని చెడగొడుతున్నారని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. సభను జరగకూడదన్నది టీడీపీ ధ్యేయంగా కనిపిస్తోందన్నారు. టీడీపీ కుట్రలకు పాల్పడుతోందని ఈటెల ఆరోపించారు. టీడీపీ మూలాలు ఆంధ్రప్రాంతంలో ఉన్నాయని అన్నారు. 25వేల మంది రైతుల ఆత్మహత్యలకు టీడీపీ, కాంగ్రెస్ కారణం కాదా అని ప్రశ్నించారు.
అన్నదాతల ఆత్మహత్యలపై సమాధానం చెప్పేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. పెన్షన్లు ఇవ్వకూడదని, గిట్టుబాటు ధరలు అందకూడదని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ఇవి అమలైతే ప్రతిపక్షపార్టీల కింద ఉన్న భూమి కదిలిపోతోందని భయపడుతున్నాయని ఈటెల పేర్కొన్నారు.