సాక్షి ప్రతినిధి, వరంగల్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న లక్ష్యం నెరవేరాలంటే పార్టీలోని కొందరు త్యాగాలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఇచ్చిన పిలుపు ఆ పార్టీ ఆశావహుల గుండెళ్లో రైలు పరుగెత్తిస్తోంది. ఎటొచ్చి ఎవరి కొంప ముంచుతుందోనని ఆందోళనలో ఉన్నారు. బెర్తును పదిలపరుచుకోవడానికి నేతలందరూ హస్తిన బాట పట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమకు అనుకూలంగా నివేదికలు రూపొందించుకుని అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
మిత్రపక్షాల మధ్య తీవ్ర పోటీ..
ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాలపై ఇప్పటికే ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకే ఈ సీట్లు కేటాయిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, నర్సంపేట, పరకాల నియోజకవర్గాలపైనే మహా కూటమి మల్లగుల్లాలు పడుతోంది. ఆయా స్థానాల్లో మిత్రపక్ష పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సీట్ల కేటాయింపు, పొత్తులు రెండు, మూడు రోజుల్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉండడంతో నేతలు దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు.
నర్సంపేటతో పీటముడి..
మహాకూటమి రాజకీయాలు అన్నీ నర్సంపే ట నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాయి. టీడీపీ.. ఉమ్మడి జిల్లా నుంచి ఒక సీటు అడుగుతో ంది. అది కూడా నర్సంపేట కావాలని పట్టుబడుతోంది. మొదటి నుంచి చంద్రబాబు నాయుడితో సన్నిహితంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి కోసం సీటు అడుగుతున్నారు. కానీ.. ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నారు. ఇద్దరి మధ్య సయో ద్య కోసం రెండు పార్టీల అధినేతలు పలు చర్చలు జరిపినా.. ఫలితం లేదు.
ఇద్దరిలో ఒకరు పరకాల, ఇంకొకరు ఇక్కడ నుంచి పోటీ చే యాలని.. వారికి సూచన చేసినట్లు తెలిసింది. అయితే తనకు నర్సంపేట తప్ప మరొకటి వద్దని ప్రకాష్‌రెడ్డి కరా ఖండీగా చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. త్యాగాలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయడంతో ఆందోళనకు గురైన తన సీటును పదిలపరుచుకునేందుకు దొంతి మాధవరెడ్డి ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. తనకు అనుకూలంగా ఢిల్లీ పెద్దల సహకారంతో తన సీటుకు ఢోకా లేకుండా లాబీయింగ్ చేసుకుంటున్నట్లు సమాచారం. అవసరమైతే తాను మళ్లీ ఇండిపెండెంట్‌గానే నర్సంపేట ప్రజలను ఓట్లు అడుగుతాను కానీ.. నియోజకవర్గాన్ని త్యాగం చేసే ప్రసక్తి లేదని అధినేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
పరకాల అలజడి..
రేవూరి మెత్తపడితే టీడీపీకి పరకాల కేటా యించి, ఆయన్ను పరకాలకు పంపేందుకు ఆలో చనలు చేస్తున్నారు. అయితే ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీ నుంచి తిరిగి సొంత గూటికి చేరిన కొండా దంపతులు పరకాల మీద గురి పెట్టారు. ఆ మేర కు కచ్చితమైన హామీతోనే వారు కాంగ్రెస్‌లో చేరి నట్లు తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధి ష్టానం ‘మీరు తూర్పు నుంచి పోటీ చేస్తారా’ అని కొండా దంపతులను సూచన ప్రాయంగా అడిగిన ట్లు తెలిసింది. దీనికి మురళి బదులిస్తూ తాము పరకాల బరిలోనే నిలబడతామని గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొండా మురళి కూడా హస్తిన బాట పట్టినట్లు తెలుస్తోంది.
‘పశ్చిమ’లో వాళ్లిద్దరు..
వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని తొలుత టీజేఎఫ్‌కు కేటాయిస్తారని, ఆ తర్వాత టీడీపీకి కేటాయించి ప్రకాశ్‌రెడ్డిని ఇక్కడకు పంపిస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడున్న సమాచారం మేర కైతే కాంగ్రెస్‌కే వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచి నాయిని రాజేందర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. రాజేందర్‌రెడ్డి మొదటి నుంచి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే ఉన్నా రు. తనకంటూ కేడర్‌ను ఏర్పాటు చేసున్నారు.
ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా రాజేందర్‌రెడ్డికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రేవంత్‌రెడ్డి తన సహచరుడు వేం నరేందర్‌రెడ్డికే ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. గతంలో ఒకసారి నరేందర్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని రేవంత్‌రెడ్డి ఏడు సీట్లు తన వాళ్లకు ఇవ్వాలని కోరినట్లు.. అందులో వేంనరేందర్‌రెడ్డితో పాటుగా ములుగు నుంచి సీతక్కకు ఇవ్వాలని అడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు రాజేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి ఢీల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది.
ములుగు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో..
మలుగులో సీతక్క, పొదెం వీరయ్య నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. ఎవరికి వారుగా జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ నాకే అంటే నాకు అని ప్రజల్లో తిరుగుతున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లలేదు గానీ.. ఢీల్లీ నేతలను హైదరాబాద్‌లోనే కలిసినట్లు సమాచారం. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్ తదితరులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. తాజాగా ఇంజినీర్స్ అసోషి యేషన్ ప్రధాన కార్యదర్శి పరికి సదానందం కూడా వీళ్లకు తోడయ్యారు. వీళ్లందరూ ఢీల్లీ పెద్దలతో లాబీయింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment