'బీజేపీ సభ్యత్వం బలుపు కాదు వాపు' | CPI Leaders takes on bjp and trs | Sakshi
Sakshi News home page

'బీజేపీ సభ్యత్వం బలుపు కాదు వాపు'

Published Wed, Apr 1 2015 2:30 PM | Last Updated on Mon, Aug 13 2018 6:24 PM

CPI Leaders takes on bjp and trs

హైదరాబాద్: బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు చేస్తామని సీపీఐ నేత సురవరం సుధాకరరెడ్డి తెలిపారు. అలాగే బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా మే 14న దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.  బుధవారం హైదరాబాద్లో ఆ పార్టీ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డితో కలసి సురవరం సుధాకరరెడ్డి మాట్లాడారు.

బీజేపీ సభ్యత్వం బలుపు కాదు వాపు అంటూ సుధాకరరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు మతోన్మాదం రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.  తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే ఏపీ వాహనాలకు పన్ను విధించడం వివాదాస్పద నిర్ణయమని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఇది ఏకపక్షం అంటూ కేసీఆర్ ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement