మాట్లాడుతున్న బృందాకారత్
సాక్షి, సుజాతనగర్: మోదీ, కేసీఆర్‌ల తెరవెనుక డ్రామాలను చైతన్యం కలిగిన తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇద్దరు తిట్టుకోవడం, ఢిల్లీలో ఇద్దరు కలిసుండే విషయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. సీపీఎం బలపరిచిన బీఎల్‌ఎఫ్ అభ్యర్థి ఎడవల్లి కృష్ణ విజయాన్ని కాంక్షిస్తూ మండల కేంద్రం సుజాతనగర్‌లో ఆదివారం బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ మాటల గారడీ చేసే వాళ్లేనని అన్నారు. వారిద్దరినీ గద్దెదించాలని చెప్పారు. అధికారం, సొంత ప్రయోజనాల కోసమే ప్రజాకూటమి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న మోదీ, అమిత్‌షాల కళ్లజోళ్లకు పేదప్రజలు కనబడటం లేదా అని ఆమె ప్రశ్నించారు. మోదీకి చిన్న తమ్ముడిలా ఉన్న కేసీఆర్ ఢిల్లీలో తన స్నేహితులను ప్రసన్నం చేసేందుకే ఎనిమిది నెలలు ముందుగానే ఎన్నికలకు పోయారన్నారు.
ఎన్నికలకు ముందు ఎన్నో హామీలను గుప్పించిన కేసీఆర్ వాటిని తుంగలో తొక్కారని, మళ్లీ అధికారదాహంతో ముందుకు వస్తున్నారన్నారు. బీజేపి, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టి, రైతు నాగలి గుర్తుకు వేసి ఎడవల్లి కృష్ణను గెలిపించాలని కోరారు. బీఎల్‌ఎఫ్ అభ్యర్థి ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే బీఎల్‌ఎఫ్ ప్రకటించిన మేనిఫోస్టోను నూరు శాతం అమలు చేస్తామని అన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కమిటీ సభ్యుడు కున్సోత్ ధర్మా, అన్నవరపు సత్యనారాయణ, మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత, కొత్తగూడెం, చండ్రుగొండ, సుజాతనగర్ మండలాల కార్యదర్శులు భూక్యా రమేష్, యాసా నరేష్, ఎంపీటీసీలు శ్రీలక్ష్మి, కుమారి మండల కార్యదర్శి వీర్ల రమేష్, బీఎల్‌ఎఫ్ నాయకులు తాళ్ళూరి శ్రీనివాసరావు, పెద్దమళ్ల నాగేశ్వరరావు, గురజాల సీతయ్య, లావుడ్యా సత్యనారాయణ, నర్రా శివరామకృష్ణ, అలవాల కార్తీక్, , కాట్రాల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
ధన రాజకీయాలను నిరోధించాలి
చుంచుపల్లి(కొత్తగూడెం): దేశంలో డబ్బుతో కూడిన రాజకీయాలు ఇటీవల బాగా పెరిగిపోయాయని, వాటిని నిరోధించడంలో ఎన్నికల సంఘం ముందుకు రావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు.ఆదివారం ఆమె కొత్తగూడెంలో విలేకరులతో మాట్లాsడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం వేల ఎకరాల భూములను సేకరిస్తూ రైతులకు అన్యాయం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి కుర్చీ కోసం పోరాటం చేస్తోందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment