డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్ టౌన్ : దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మెదక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలన్నారు. దీంతో రైతులకు మద్దతు ధరతో పాటు డబ్బులు త్వరగా వస్తాయన్నారు. ఎరువులు, విత్తన విక్రయ కేంద్రాలు కూడా మార్కెట్ కమిటీలోనే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట ఆర్డీఓ నగేష్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశం గుప్తా పాల్గొన్నారు.
దాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు:డిప్యూటిస్పీకర్‌తో రైతుల మొర
మెదక్ రూరల్ : ధాన్యం కొనుగోలు కేంద్రంలో వారం రోజులుగా తూకం వేయడం నిలిపివేశారని, దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో జక్కన్నపేట రైతులు మొరపెట్టుకున్నారు. బుధవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మండల పరిధిలోని జక్కన్నపేటలోని ఓ వివాహనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు రైతులు మాట్లాడుతూ గతసంవత్సరం నుండి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం కొనసాగుతున్నప్పటికీ తమకు నిర్వాహకులు కొనుగోలు ప్రతం ఇవ్వడం లేదన్నారు. ఈ విషయమై ప్రశ్నిస్తే తూకం వేయడం నిలిపి వేశారని వారు డిప్యూటీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించి, కొనుగోలు పత్రాలను ఇప్పిస్తానని హమీ ఇవ్వటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
Published Wed, May 20 2015 11:37 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement