సస్పెన్షన్ ఎత్తివేతపై ఏకభిప్రాయం లేదు | Do not lift the suspension on a single judgement | Sakshi
Sakshi News home page

సస్పెన్షన్ ఎత్తివేతపై ఏకభిప్రాయం లేదు

Published Wed, Mar 25 2015 1:11 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Do not lift the suspension on a single judgement

స్పీకర్ మధుసూదనాచారి స్పష్టీకరణ

హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేతపై అన్ని పార్టీలు ఏకభిప్రాయానికి రాలేదని, అందుకే ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకోలేకపోయామని స్పీకర్ మధుసూదనాచారి స్పష్టం చేశారు. ఏకభిప్రాయం కోసం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ ఎల్పీనేత కె.లక్ష్మణ్, కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి తదితరులు ప్రశ్నోత్తరాల అనంతరం పట్టుబట్టారు.

సమావేశాలకు ఇంకా రెండురోజులే సమయం ఉందని, టీడీపీ సభ్యులు లేకుండానే తొలి బడ్జెట్ సమావేశాలు జరుపుకోవడం సరికాదని విపక్షాలు మండిపడ్డాయి. కావాలనే సభ లో గొడవ చేయడంతోనే సస్పెండ్ చేయా ల్సి వచ్చిందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement