- ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సలహా
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ తరహాలోనే రాష్ట్రంలో మరో 11 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న అంశంపై ‘పురం..పాలన శూన్యం’ శీర్షికతో సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ బి.నాగిరెడ్డి స్పందించారు. ఈ మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై ఆయన పురపాలక శాఖ నుంచి నివేదిక కోరారు.
దీంతో రాష్ట్ర పురపాలక శాఖ డెరైక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌కు స్టేటస్ రిపోర్టును అందజేశారు. ఈ సందర్భంగా మరో 3 నెలల్లో ఎన్నికలకు సంబంధించిన కసరత్తు పూర్తిచేసి సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని ఎన్నికల కమిషనర్ పురపాలక శాఖకు సలహా ఇచ్చినట్లు సమాచారం.
సెప్టెంబర్‌లో ‘పుర’ఎన్నికలు!
Published Tue, May 5 2015 2:49 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement