సాక్షి, హైదరాబాద్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ ఒకటిన సామూహికంగా విధులకు సెలవు పెట్టిన ఉద్యోగులకు ఒక రోజు వేతనాన్ని కట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధులకు గైర్హాజరైన ఉద్యోగులకు ఒక రోజు వేతనాన్ని నిలిపి వేయాలంటూ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ కేఎస్‌ఆర్‌సీ మూర్తి ఇటీవలే అన్ని జిల్లా ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఒక రోజు జీతం కోత వేయాలని సూచించారు. తమ విభాగంలోని ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేయడం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.