మాజీ భార్యకు ‘ఫేస్‌బుక్’ వేధింపులు | Ex-husband arrested in assault case, suspected in abduction | Sakshi
Sakshi News home page

మాజీ భార్యకు ‘ఫేస్‌బుక్’ వేధింపులు

Published Sat, Aug 9 2014 8:12 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

మాజీ భార్యకు ‘ఫేస్‌బుక్’ వేధింపులు - Sakshi

మాజీ భార్యకు ‘ఫేస్‌బుక్’ వేధింపులు

 *ఆపై ఫోన్‌లో బెదిరింపులు
  *బాధితురాలి ఫిర్యాదుతో
  *కటకటాల పాలు

గోల్కొండ: తనకు విడాకులు ఇచ్చిందన్న కక్షతో ఓ వ్యక్తి తన మాజీ భార్యను హైటెక్ పద్ధతుల్లో వే ధించసాగాడు. అసభ్యకర చిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఆమెతోపాటు సదరు కుటుంబ సభ్యులను కూడా ఫోన్లలో బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. సైబరాబాద్ డీసీపీ( క్రైమ్స్) జి.జానకీ షర్మిల శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులతో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన అశ్వాక్(38) నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. శామీర్‌పేట్‌లోని ఐవీ లీగ్ అకాడమీ రెసిడెన్సియల్ స్కూల్‌లో ఎస్టేట్ మేనేజర్‌గా ఉంటూ 3 మార్చి 2013న ప్రైవేటు స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో కాపురం పెట్టారు. శామీర్‌పేటలోనే ఉండాలనేది అశ్వాక్ ఆలోచన. ఈ విషయమై భార్యాభర్తల మధ్య నిత్యం గొడవ జరిగేది. ఈ దశలో ఆమెపై పలు ఆరోపణలు చేయసాగాడు. అంతేగాక ఆమెను వదిలి అశ్వాక్ ఒక్కడే శామీర్‌పేటకు మకాం మార్చుకున్నాడు. దీంతో అతని భార్య వరంగల్ కోర్టులో విడాకుల పిటిషన్ పెట్టుకుంది.

ఇతను కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం బాధితురాలికి విడాకులు మంజూరు చేసింది. విడాకుల అనంతరం అశ్వాక్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తప్పుడు చిరునామాతో షకీలా అనే పేరుతో ఫేస్‌బుక్ ఖాతా తెరిచాడు. మాజీ భార్యకు చెందిన చిత్రాలను అందులో అప్‌లోడ్ చేశాడు. గూగుల్ ద్వారా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి సిమ్‌కార్డులు తీసుకొని ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్లు చేయడం మొదలు పెట్టాడు. అసభ్యకరమైన మెసేజ్‌లు పంపేవాడు.

ఈ విషయమై బాధితురాలు ఇటీవల సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. విచారణను చేపట్టిన పోలీసులు గురువారం శామీర్‌పేట్‌లో అశ్వాక్‌ను అదుపులోకి తీసుకున్నారు. విడాకుల ఇచ్చినందునే మాజీ భార్యను వేధించేందుకే తాను ఇవ న్ని చే శానని అశ్వాక్ అంగీకరించినట్టు డీసీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన ఏసీపీలు ఎస్.జయరామ్, డి.ప్రతాప్ రెడ్డిలను ఆమె అభినందించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement