నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచటంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జనగాం (వరంగల్) : నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచటంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో నీరటి రాజు(32) వ్యవసాయం చేసి అప్పుల పాలయ్యాడు. ఈ ఏడు పంటల పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో దిగులు చెందాడు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం పొలానికి వెళ్లి అక్కడే పురుగు మందు తాగాడు. తిరిగి వస్తూ పడిపోయిన అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. అతడికి భార్య మాధవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.