రైతు ఆత్మహత్యలు బాధాకరం
భవిష్యత్తులో అలా జరుగకుండా చూస్తాం
⇒ వాటితో టీఆర్‌ఎస్ సర్కారుకు సంబంధం లేదు
⇒ గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే కరెంటు కొరత, కోత
⇒ విద్యుత్ ఉత్పాదన పెంచేందుకు త్వరలో కొత్త ప్రాజెక్టులు
⇒ చిన్న నీటి వనరులను అభివృద్ధి చేస్తాం
⇒ సాగు విస్తీర్ణాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల ఎకరాలకు పెంచుతాం
⇒ ఈ సారి రైల్వే బడ్జెట్‌లో మనకు రూ.200 కోట్ల వరకు రావచ్చు
⇒ ‘మీట్ ది ప్రెస్’లో నిజామాబాద్ ఎంపీ కవిత
నిజామాబాద్ అర్బన్: రైతుల ఆత్మహత్యలు వాస్తవమే అయినప్పటికీ, బాధాకరమ ని, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరుగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ఎంపీ కవిత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆమె మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో ఆత్మహత్యలు జరుగలేదన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే రాష్ట్రంతో కరెంటు కొరత ఏర్పడిందన్నారు. చంద్రబాబు హైటెక్ పాలనలో అవకాశం ఉన్నా తెలంగాణలో కరెంటు ఉత్పత్తిని పట్టించుకోలేదన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక నల్గొండ, రామగుండం కేంద్రాలలో కరెంటు ఉత్పాదనకు తగిన ఏర్పాట్లు చేసిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసిందన్నారు. ఏపీ సీఎం నేటికీ రుణమాఫీ చేయలేదన్నారు.
వేరే పార్టీలకు మనుగడ లేదు
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మినహా ఏ ఇతర పార్టీలకూ మనుగడ లేదని ఎంపీ కవిత పునరుద్ఘాటించారు. టీఆర్‌ఎస్ పార్టీకి రోజురోజుకూ ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోందన్నారు. తన నియోజకవర్గ పరిధిలో పంటల సాగు విస్తీర్ణం ప్రస్తుతం ఐదు లక్షల ఎకరాలుందని, వచ్చే ఐదేళ్లలో పది లక్షల ఎకరాలకు పెంచుతామన్నారు. ఇందుకోసం చిన్న నీటి పారుదల సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ రైల్వే బడ్జెట్‌లో పెద్దపల్లి,నిజామాబాద్ మార్గానికి రూ.200 కోట్లు మంజూరయ్యే అవకాశముందన్నారు. రైల్వే మంత్రి సురేష్‌ప్రభు తనతో మాట్లాడినప్పుడు ఈ మేరకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. బాన్సువాడ, బోధన్ బీదర్ రైలు మార్గానికి ముందడుగు ఉంటుందన్నారు.
గల్ఫ్ బాధితులకు ప్రత్యేక శాఖ
గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఎంపీ పేర్కొన్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఉన్నతాధికారు లతో ఓ కమిటీ ఏర్పాటు చేశారని, వీటి పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. ఇదివరకే జిల్లాలో స్పైసెస్ పార్కుకు అనుమతి ఇచ్చారని, ప్రభుత్వం కూడా దీనికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుం టున్నామన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రినీ అభివృద్ధి చేస్తా మన్నారు.
బీడీ కట్టలపై పుర్రె గుర్తును తొలగించడానికి పో రాటం చేస్తామన్నారు. ఛాతీ ఆస్పత్రి తరలింపు ప్రజావసరాల కోసమేనని,ఈ విషయంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్న సమ్మతమేనన్నారు. ప్రతిపక్షాలు అనవసర రా ద్ధాంతం చేస్తున్నాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నిక ల ముందు ఇచ్చిన హామీలను రెండేళ్లలోనే అమలు చేసి తీరుతుందన్నారు. ఏడాదిలోపు నేరాల రేటు సగానికి తగ్గిస్తామన్నారు. మహిళలపై అఘాయిత్యాలు, చైన్ స్నా చిం గ్,అత్యాచారాలు వంటి ఘటనలను తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు.
జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు, ఇళ్లస్థలాలు
జర్నలిస్టులంటే తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే ప్రక్రియ కొనసాగుతోం దన్నారు. అనువైన స్థలం ఎక్కడ ఉందో చూసుకో వాలని సూచించారు. ఆరోగ్య కార్డులు కూడా అందిస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఎంపీ నిధుల నుంచి రూ. 10 లక్షలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎ మ్మెల్యే జీవన్‌రెడ్డి, జడ్‌పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి, మేయర్ ఆ కుల సుజాత,ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.