రైతు ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వం | Farmers' suicides rocks Telangana state | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వం

Published Sat, Nov 15 2014 5:46 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

రైతు ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వం - Sakshi

రైతు ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వం

ఆలేరు : పంటలు ఎండి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాక ర్‌రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన ఆలేరులో విలేకరులతో మాట్లాడారు. అర్హులైన వారి పెన్షన్‌లు, రేషన్‌కార్డులను తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్ గద్దెనెక్కాక వారికి చేసింది శూన్యమని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు.

ఎన్నో ఆశలతో ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారని, తీరా ఇప్పుడు ప్రజలు ఎందుకు ఓటేశామని బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తుందని చెప్పారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఆరె రాములు, ఎండీసలీం, చామకూర అమరేందర్‌రెడ్డి, ఆలేటి మల్లేశం, జూకంటి పెద్ద ఉప్పలయ్య, మోర్తల సాంబిరెడ్డి, గ్యాదపాక దానయ్య, భోగ సంతోష్‌కుమార్, ఎండీ రఫీ, ఎండీ మహబూబ్, గంధమల్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement