దమ్మపేట: నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభతో పాటు, నేటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటివరకు ఐదుసార్లు శాసనసభ్యుడిగా ప్రా తినిధ్యం వహించారు. దమ్మపేట మండ ల పరిధిలోని గండుగులపల్లి ఈయన స్వ గ్రామం. తొలిసారిగా 1985లో సత్తుపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత 1989లో ఓటమి చెందిన ఆయన..అదే నియోజకవర్గం నుంచి 1994, 1999 ఎన్నికల్లో వరుసగా ఎన్నికయ్యారు. 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014లో అదే స్థానంలో ఓడారు. 2016లో పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్ నుంచి పోటీచేసి తెలంగాణ శాసనసభలో అడుగుపెట్టారు. 2009–14 మధ్యకాలం మినహా ఆయన గెలిచిన ప్రతిసారీ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడం విశేషం. తాజాగా పాలేరు నియోజకవర్గం నుంచి ఆయన తిరిగి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు.
5 సార్లు గెలిచారు
Published Wed, Nov 21 2018 3:19 PM | Last Updated on Wed, Nov 21 2018 3:19 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment