బుడాన్ బేగ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బుడాన్ బేగ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బుధవారం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఒక దశలో మైనార్టీ కోటాలో కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. 2009లో టీఆర్‌ఎస్‌లో చేరిన బుడాన్ బేగ్ ఉద్యమ సమయంలో పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అనేక ఆందోళనలు, ఉద్యమాలకు నేతృత్వం వహించిన ఆయనను టీఆర్‌ఎస్ పార్టీ 2014లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించింది. తర్వాత టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బేగ్ ఆకస్మిక నిర్ణయం టీఆర్‌ఎస్‌లో కలకలం రేపింది.
ఇటీవలి వరకు పార్టీ రాష్ట్ర నేతలు, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు వంటి ముఖ్యనేతల పర్యటనలు, సభలు, సమావేశాలు నిర్వహించిన సమయంలో వేదికపై అంతా తానై నడిపించిన ఆయన అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే అంశం కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల్లో చర్చనీ యాంశంగా మారింది. మంత్రి తుమ్మలకు అత్యం త సన్నిహితుడిగా.. ప్రధాన అనుచరుడిగా వ్యవహరించి.. కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేస్తున్న బేగ్ పార్టీ వీడడం వెనుక కారణాలపై శ్రేణులు ఆరా తీసే పనిలో పడాయి. కొంతకాలంగా బేగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, పార్టీలో తన నిర్ణయానికి విలువ లేకుండా పోయిందని, ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉద్యమ సమయంలో పనిచేసిన వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని పలు సందర్భాల్లో కార్యకర్తల ఎదుట ఆవేదనకు గురైనట్లు ప్రచారం జరుగుతోంది. బేగ్ కీలక ఎన్నికల సమయంలో కారు దిగి.. సైకిలెక్కడంతో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈనెల 28న రాహుల్‌గాంధీ పర్యటనలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఖమ్మం రానుండడంతో అదే సమయంలో బేగ్ చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
నియంతృత్వ విధానాల వల్లే..
టీఆర్‌ఎస్ పార్టీలో నియంతృత్వం మితిమీరుతోందని, వ్యక్తి స్వేచ్ఛకు తావు లేదని, ఉద్యమ కాలం లో పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన వారికి గుర్తింపు లేదనే కారణాల వల్లే టీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్లు బేగ్ తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని, బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో మైనార్టీల హక్కులకు భం గం కలిగించేలా వ్యవహరిస్తుందన్న మనోవేదన సైతం తాను పార్టీ వీడేందుకు ఒక కారణమని చెప్పారు. పార్టీ సభ్యత్వానికి.. కార్పొరేషన్ చైర్మన్ పదవికి మంగళవారం రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చెమటోడ్చిన నేతల కష్టాన్ని పార్టీ విస్మరించిందని, వారికి కనీస గుర్తింపు ఇవ్వడంలోనూ విఫలమైందని, ఈ అంశం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. తనతోపాటు ఉద్యమ కాలంలో పనిచేసిన వారికి పార్టీలో సరైన గుర్తింపు లేదన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక గతంలో ఉన్న వారి చేతిలో కాకుండా.. ఉద్యమ ద్రోహుల చేతిలో కి పార్టీ వెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment