స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగుర వేయకుండా మద్యం మత్తులో చిందులేసిన ‘ఆటవిక అధికారి’పై బుధవారం సాయంత్రం సస్పెన్షన్ వేటు పడింది.
‘సాక్షి’లో ప్రచురితమైన కథనం, ఇతర ఆధారాలను సేకరిం చారు. ఈ క్రమంలో సదానందచారిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై డీఎఫ్‌వో పురుషోత్తంను ‘సాక్షి’ ఫోన్ ద్వారా వివరణ కోరగా సదానందచారిని సస్పెండ్ చేసింది వాస్తవమేనని, వరంగల్ రేంజ్–1 అధికారి నాగిని భానుకు అచ్యుతాపురం రీసెర్చ్ సెంటర్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించామని చెప్పారు.