సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విచక్షణ కోల్పోయి మతిభ్రమించి మాట్లాతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో వరుస ఓటములతో పొన్నం ఓటమికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఎద్దేశా చేశారు. అసెంబ్లీలోని టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌పైనా, నాపైనా పొన్నం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. పొన్నం విచక్షణ కోల్పోయి మతిభ్రమించి మాట్లాడారు. పొన్నం ఓ రాజకీయ వ్యభిచారి. 5 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్కసారి గెలిచారు. నేను ఐదుసార్లు పోటీ చేస్తే ఐదుసార్లు గెలిచాను. పొన్నం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌లకే పరిమితం. కరీంనగర్‌లో ఆయనకు అంత సీన్ లేదు. కరీంనగర్‌లో మొన్న పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమవడంతో తెలంగాణ కేఏ పాల్‌గా మారారు. పొన్నం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాలి గోటికి సరిపోరు..’ అని వ్యాఖ్యానించారు.
పొన్నం ఓ మీటర్ బద్ద.. తుపాకీ రాముడు
తెలంగాణ ఉద్యమంలో పొన్నం ఓ డ్రామా ఆర్టిస్టు అని గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. ‘లగడపాటి రాజగోపాల్‌తో కుమ్మక్కై పెప్పర్ స్ప్రే కొట్టించుకున్నారు. అయినా 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు పొన్నం ప్రభాకర్‌ను తుక్కుతుక్కుగా ఓడించారు. నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించానని పొన్నం ప్రభాకర్ దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు పొన్నం ఉన్న పార్టీలో ఎవరైనా చేరతారా? పొన్నంను కాంగ్రెస్ నుంచి మెడ పట్టి గెంటేయాలి. పొన్నం ఓ మీటర్ బద్ద.. తుపాకీ రాముడు. పొన్నం పోటుగాడని మళ్ళీ కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్నారా? కేటీఆర్‌ను విమర్శించే అర్హత పొన్నంకు ఉందా? స్థాయికి మించి సంస్కారం లేకుండా మాట్లాడితే మేం ఊరుకోం. ఎంపీగా కాదు కార్పొరేటర్‌గా పోటీ చేయాలి. మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా, ఎంపీగా పొన్నం ప్రభాకర్‌ది అవినీతి చరిత్రే. పొన్నం ఖబడ్దార్.. సంస్కారం లేకుండా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని గంగుల కమలాకర్ హెచ్చరించారు.
పొన్నంకు మతి భ్రమించింది
Published Sat, Mar 9 2019 2:21 AM | Last Updated on Sat, Mar 9 2019 2:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment