సాక్షి, హైదరాబాద్ : మంత్రి చొరవ తీసుకొని రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి సూచించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రేషన్ డీలర్స్ అసోసియేషన్ క్యాలెండర్‌ను సోమవారం పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమానికి ముందుగా నేను రావాలని అనుకోలేదు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ప్రభుత్వ వాటాదారులు. మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల రేషన్ బియ్యం రీసైక్లింగ్ తప్పింది. అందుకు కారణం మీరే. మంత్రివర్గ సమావేశంలో మీకు శుభవార్త తీసుకు వస్తా.. ఈ మేరకు సీఎం కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారు. మీకు కడుపునిండా భోజనం పెడతాం’ అని పేర్కొన్నారు.
పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమ్మె విరమిస్తే అందరి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెప్పగా.. ఇప్పటికీ కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు. సమిష్టిగా సేవ చేస్తున్న రేషన్ డీలర్ల కష్టానికి తగిన ఫలం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో 7000 వేలు రేషన్ డీలర్లు సేవ చేస్తున్నారని, వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment