
వైభవంగా గోదావరి పుష్కరాలు
గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చేఏడాది జూలై 14 నుంచి ప్రారంభమయ్యే తొలి పుష్కరాలకు ముఖ్యఅతిథిగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ఇతర రాష్ట్రాల గవర్నర్లను, ముఖ్యమంత్రులను
ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్: గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చేఏడాది జూలై 14 నుంచి ప్రారంభమయ్యే తొలి పుష్కరాలకు ముఖ్యఅతిథిగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ఇతర రాష్ట్రాల గవర్నర్లను, ముఖ్యమంత్రులను అతిథులుగా ఆహ్వానించాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. పుష్కరాల వేళ అనుసరించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకునేందుకు శృంగేరీ పీఠాధిపతి జగద్గురు శంకరాచార్యుల వద్దకు ప్రభుత్వ సలహా దారు కె.వి. రమణాచారి నేతృత్వంలో ఒక బృందాన్ని పంప నున్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్‌రావు, దేవాదాయశాఖ కార్యదర్శి వెంకటేశ్వర్ రావు, టీఆర్‌ఎస్ నేతలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు హాజరయ్యారు. శృంగేరీ, కంచి, ఇతర పీఠాధిపతులు, చినజీయర్‌స్వామి వంటి ఆధ్యాత్మిక గురువులను ఆహ్వానించాలని సీఎం సూచించారు. 2 కోట్లకు పైగా వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల తో ప్రవచనాలు ఇప్పించాలని, ధార్మిక, ఆధ్యాత్మిక, సాం స్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. గోదావరితీరంలోని ఆలయాలకు మరమ్మతులు చేపట్టాలన్నారు.