సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో కొనసాగుతున్న పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఖాళీల భర్తీకి సంబంధించిన ఫైలును గిరిజన సంక్షేమ శాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేయడంతో ఆయా ఖాళీల భర్తీకి మార్గం సుగమమైంది. ఉట్నూరు, ఏటూరు నాగారం, భద్రాచలం ఐటీడీఏల పరిధిలో 320 గిరిజన సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి.
వీటి పరిధిలో దాదాపు లక్ష మంది విద్యార్థులున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో 2,825 పోస్టులుండగా... 601 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 563 ఉండగా... స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 38 ఉన్నాయి. ఇందులో పూర్తిగా ఏజెన్సీ పరిధిలో 241 పోస్టులుండగా.... మైదాన ప్రాంతాల్లో 360 పోస్టులున్నాయి.
టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ..: గిరిజన పాఠశాలల్లో ఖాళీలను గతంలో జిల్లా స్థాయిలో భర్తీ చేయగా ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసే అవకాశాలున్నాయి. టీఆర్టీ పద్ధతిలోనే పోస్టులను భర్తీ చేస్తా మని సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు.
కేటగిరీ పోస్టులు
ఎస్‌జీటీ 563
స్కూల్ అసిస్టెంట్
గణితం 1
ఫిజికల్ సైన్స్ 2
సోషల్ స్టడీస్ 1
పీఈటీ 5
క్రాఫ్ట్ 5
డ్రాయింగ్ 2
తెలుగు పండిట్ 18
హిందీ పండిట్ 4
Comments
Please login to add a commentAdd a comment