
పవన్.. ఒక పాగల్ : గుత్తా ధ్వజం
నల్లగొండ, న్యూస్‌లైన్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒక పాగల్ (పిచ్చోడు) అని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. శనివారం నల్లగొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘నీలాంటి (పవన్) పాగల్‌గాళ్లను ఎంతో మంది కాంగ్రెస్ చూసింది. పంచ్‌డైలాగ్‌లు, ఆవేశంతో ఊగిపోతే.. మెదడు ఖరాబు కావడం తప్ప జరిగేదేమీ ఉండదు. జనసేన ఆవిర్భావం సందర్భంలో, విశాఖ బహిరంగ సభ ప్రసంగాల్లో తెలంగాణ పట్ల అక్కసు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేని స్వభావాన్ని బయట పెట్టుకున్నాడు’’ అని దుయ్యబట్టారు.