'ఆయనది విష ప్రచారం' | harish rao slams on kishan reddy | Sakshi
Sakshi News home page

'ఆయనది విష ప్రచారం'

Published Fri, Apr 17 2015 2:07 PM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

'ఆయనది విష ప్రచారం'

'ఆయనది విష ప్రచారం'

హైదరాబాద్: ప్రజాప్రయోజన కార్యక్రమాలపై విష ప్రచారం చేయటంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని మించినవారు లేరని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిషన్ కాకతీయ పథకంపై బురదజల్లటం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. బీజేపీకే చెందిన కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్ వంటి పెద్దలు ఈ కార్యక్రమాన్ని మెచ్చుకున్నా..కిషన్‌రెడ్డి మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన మిషన్ కాకతీయను మిషన్ గులాబీ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించటాన్ని ఖండించారు. మంచిని మంచిగా, చెడును చెడుగాను గుర్తించే సంస్కారం అలవర్చుకోవటం రాజకీయ నేతలకు అవసరమని సూచించారు. మిషన్‌కాకతీయపై విష ప్రచారాన్ని మానుకుని ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement