సాక్షి, సంగారెడ్డి: ఎన్నో ఏళ్ల జడ్పీ భవన నిర్మాణ కల నెరవేరిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జడ్పీ భవనంలో చిరిగిన సీట్లు, ఉక్కపోతతో ఇరుకుగా ఉండేదని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నూతన భవనం నిర్మించామని చెప్పారు. 15 శాతం ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు కేటాయించామని తెలిపారు. ఇందులో ఐదు శాతం జడ్పీకి, పది శాతం మండల పరిషత్తులకు కేటాయించామని వెల్లడించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఉంటాయని తెలిపారు. మీటింగ్‌కు వచ్చే జడ్పీటీసీలు ప్రతి విషయంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తమ ప్రాంత ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేయాలన్నారు. మొక్కుబడిగా కాకుండా అర్థవంతమైన చర్చలు జరగాలని మంత్రి చెప్పారు. (13న టీపీసీసీ నేతల ‘గోదావరి జలదీక్ష’)
ఈసారి చదువుకున్న మహిళలు సభ్యులుగా ఉండటం చాలా సంతోషమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సభ్యులు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. సభ్యులే జడ్పీని నడపే విధంగా తయారు కావాలన్నారు. ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో పెట్టామని చెప్పారు. 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చిన రాష్టం తెలంగాణ ఒక్కటే అని గుర్తుచేశారు. రైతులు అధిక దిగుబడి పంటలు పండించడానికి ముందుకు రావాలని కోరారు. 116 రైతు వేదికలు వర్షంకాలంలో పూర్తి చేయాలన్నారు. రైతు వేదికలకు ఒక్కే రోజు భూమి పూజ పెట్టుకుందామని అన్నారు. దసరా పండగ లోపు పూర్తి చేసుకుందామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి పూర్తి చేయించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. (‘విద్యుత్ బిల్లులను ప్రభుత్వం మాఫీ చేయాలి’)
Comments
Please login to add a commentAdd a comment