
పశువులకు సంచార వైద్యశాలలు
►మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఖమ్మం వ్యవసాయం: 108 వైద్య సేవల మాదిరిగానే పశువులకూ సంచార వైద్య సేవలను తీసుకొస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.
ఆదివారం ఖమ్మంలో జరిగిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కురమలు, యాదవుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పశువులకు, జీవాలకు అత్యవసర సేవలందించేం దుకు ఈ నెల చివరి నుంచి సంచార వైద్యశాలలు ప్రారంభిస్తున్నామని చెప్పారు.