
రూ. లక్ష కోట్లు ఎలా ఖర్చు చేస్తారు?
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడిపండు చందంలా ఉందని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శుక్రవారం కాంగ్రెస్‌పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బడ్జెట్‌పై కేసీఆర్‌కు పొన్నాల ప్రశ్న
సంగారెడ్డి: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడిపండు చందంలా ఉందని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శుక్రవారం కాంగ్రెస్‌పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మార్చి నెలకు కేవలం నాలుగు నెలలు మాత్రమే గడువు వుందని, ఈ సమయంలో రూ.లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఎలా ఖర్చు చేస్తారన్న విషయాన్ని ప్రజలకు వెల్లడించాలని కోరారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో భూము లు అమ్మితేనే రూ.లక్షల కోట్ల ఆదాయం రాలేదని, అలాంటప్పుడు ఇన్ని కోట్లు ఖజానాకు ఎలా వస్తాయన్న విషయాన్ని కూడా తెలియజేయాలని పేర్కొన్నారు.