ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే గడువు రెండు రోజులే మిగిలి ఉండడంతో సోమవారం జిల్లావ్యాప్తంగా దరఖాస్తు కేంద్రాలకు ప్రజలు పోటెత్తారు.
ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే గడువు రెండు రోజులే మిగిలి ఉండడంతో సోమవారం జిల్లావ్యాప్తంగా దరఖాస్తు కేంద్రాలకు ప్రజలు పోటెత్తారు. దరఖాస్తులు అందజేసేందుకు ఆలస్యమవుతుండడంతో చంటిపిలల్లతో వచ్చిన తల్లులు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు.
ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లు, ఆహార భద్రతకార్డులు, నిరుపేద విద్యార్థులు ‘ఫాస్ట్’ పథకం కింద ఆర్థికసాయం పొందేందుకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిలో ప్రతి పథకం కోసం కుటుంబయజమాని స్వయ ంగా.. లేకుంటే కుటుంబసభ్యుల ద్వారా ద రఖాస్తులు అందజేయవచ్చు. ఒక్కో పథకానికి కుటుంబసభ్యులు వేర్వేరుగా అర్జీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక కుటుంబానికి ఆహార భద్రతకార్డు, ఇంట్లో ఒకరికి పింఛన్ కావాలంటే రెండింటి కోసం వేర్వేరుగా దరఖాస్తులు ఇవ్వాలి. అలాగే ఫాస్ట్ పథకం కోసం కులం, నివాసం సర్టిఫికెట్‌కు ఒకటి, ఆదాయం ధ్రువీకరణ పత్రంకోసం మరొకటి ఇవ్వాలి.
పింఛన్లు, ఆహార భద్రతకార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రత్యేకంగా నమూనా అవసరంలేదు. తెల్లకాగితంపై య జమాని కుటుంబవివరాలు రాసి దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. అయితే కుటుంబంలో ఎంతమందికి ఆహార భద్రతకార్డు కావా లో.. వారి పేర్లు, ఆధార్ నంబర్లు దరఖాస్తులో రాయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ విషయంలో ఈ- ఆధార్ నంబర్ కాకుండా శాశ్వత ఆధార్ నంబర్ ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఫొటోలు, ఇతర జిరాక్స్‌లు అవసరంలేదు.
సంక్షేమ పథకాలకు అర్హులను ఎలా గుర్తించాలనే విషయానికి సంబంధించిన నియమ నిబంధనలను ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. ఇందులో 5ఎకరాలకంటే ఎక్కువగా సాగుభూములున్న రైతులు, ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్, అవుట్‌సోర్సింగ్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ప్రొఫెషనల్స్, స్వయం ఉపాధి పొందుతున్నవారు, రైస్‌మిల్లులు, పెట్రోల్ పంపులు, ఇతర షాపులు ఉన్నవారు ప్రభుత్వ పథకాలకు అనర్హులని నిబంధనల్లో పేర్కొన్నారు. అలాగే ఫోర్‌వీలర్ వాహనాలు ఉన్నవారు కూడా అనర్హులు.