భద్రాచలం: తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని తడపలగుట్ట వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలను భద్రాచలం పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఇప్పటికే ఒకరిని వరంగల్ జిల్లాకు చెందిన దడబోయిన స్వామి, అలియాస్ ప్రభాకర్‌గా గుర్తించారు. కాగా ఆదివారం మిగిలిన తొమ్మిది మంది మావోయిస్టుల వివరాలను తెలియజేశారు. వీరి గురించి ఇంకా కచ్చితమైన సమాచారంతోపాటు, మృతులను గుర్తుపట్టే వారు ఎవరైనా తమను సంప్రదించాలని తెలిపారు. వివరాలను తెలిపేవారు 9440795319, 9440795320 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు సూచించారు.
మృతుల వివరాలు ఇవీ (అంతా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంవారే)...
- 1. కోసి కుకుడం, రంగై గ్రామం, ఏరియా కమిటీ సభ్యురాలు. కుంట బ్లాక్, సుకుమా జిల్లా
- 2. పొడియం బామన్ అలియాస్ మల్లేశ్, ఏరియా కమిటీ సభ్యురాలు. డుంగా, అర్చా బ్లాక్, నారాయణపూర్ జిల్లా
- 3. రామె, అలియాస్ సోడి పాండే, ఏరియా కమిటీ సభ్యురాలు. వీరాపురం, కుంట బ్లాక్, సుకుమా జిల్లా, సౌత్ బస్తర్
- 4. సంగీత అలియాస్ కుమ్మ ప్రమీల, ఏరియా కమిటీ సభ్యురాలు. మూకవెల్లి, భూపాలపట్నం బ్లాక్, బీజాపూర్ జిల్లా, నేషనల్ పార్క్ ఏరియా, వెస్ట్ బస్తర్
- 5. పూనెం జోగాలు, ఏరియా కమిటీ సభ్యుడు. ఊసూర్ బ్లాక్, ఊర్నూర్ గ్రామం, బీజాపూర్ జిల్లా, సౌత్ బస్తర్
- 6. రత్న అలియాస్ తెల్లం సోని, దళ సభ్యురాలు. కాకికోర్మా గ్రామం, బీజాపూర్ జిల్లా వెస్ట్ బస్తర్, గంగులూరు
- 7. హేమ్లా పాయకి, అలియాస్ లలిత, దళ సభ్యురాలు. ఆవునూర్ గ్రామం, బీజాపూర్ జిల్లా, వెస్ట్ బస్తర్, గంగులూరు ఏరియా
- 8. మడవి శాంతి, అలియాస్ సోని, దళ సభ్యురాలు. దెందోడు గ్రామం, బైరాంగఢ్ బ్లాక్, బీజాపూర్ జిల్లా, వెస్ట్ బస్తర్,
- 9. ఉండం జోగి, అలియాస్ లలిత, దళ సభ్యురాలు. వికదంపల్లి గ్రామం, సుకుమా జిల్లా, కుంట బ్లాక్, సౌత్ బస్తర్, జేగురుకొండ ఏరియా
ఎన్‌కౌంటర్ మృతుల గుర్తింపు
Published Mon, Mar 5 2018 2:48 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment