ఆదిలాబాద్ అర్బన్/ఆసిఫాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక, ఆర్థిక సర్వేకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో సర్వే పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నేరుగా ప్రజలే వివరాలు తెలియజేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా సమగ్ర సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించేందుకు సన్నద్ధమయ్యారు. జిల్లాలోని కుటుంబాలను గుర్తించిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ పథకాల నిధులు విడుదల చేస్తే నేరుగా లబ్ధిదారులకు చేరుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
సర్వేలో లేని కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇంటింటి సర్వే ఆధారంగా ప్రభుత్వం జనాభా ప్రతిపాదికన సంక్షేమ పథకాలు వ ర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 19న జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు 30వేలకుపైగా అధికారులను, సర్వే ఎన్యూమరేటర్లను వినియోగించనున్నారు. సర్వే అనంతరం నివేది కను ప్రభుత్వానికి నివేదించనున్నారు. సర్వేలో వివరాలు నమోదు చేసుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో 6,96,248 కుటుంబాలు
జిల్లాలోని 52 మండలాల్లో 866 గ్రామ పంచాయతీలు, ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం వీటి పరిధిలలో 6,96,248 కుటుంబాలు ఉన్న ట్లు అధికారులు గుర్తించారు. ఇందులో పట్టణ ప్రాంతా ల్లో 1,26,307 కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5,32,298 కుటుంబాలు ఉన్నాయనే వివరాలు అధికారు లు సిద్ధం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింట సర్వే చేసేందుకు 5,052 మంది ఎన్యూమరేటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేసేందుకు 22,812 మంది ఎన్యూమరేటర్లను నియమించారు.
వీరితోపాటు 3 వేల మందికిపైగా సూపర్‌వైజర్లు, అధికారులు ఈ సర్వేలో పాల్గొనున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 25 నుంచి 30 ఇళ్ల చొప్పు న సర్వే నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు సంబంధించిన 30,700 సమగ్ర సర్వే పుస్తకాల పేరిట ప్రింటింగ్ చేయిస్తున్నారు. కుటుంబ సర్వే ద్వారా ప్రజలు ఎలాంటి తప్పులు లేకుం డా పూర్తి సమాచారం అందించాలని అధికారులు సూచి స్తున్నారు.
ఎన్యూమరేటర్లను, సూపర్‌వైజర్లను గ్రామాలకు తరలించేందుకు 100 ఆర్టీసీ బస్సులు, 646 ఇతర వాహనాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కళాశాలల, పాఠశాలల, ట్రాన్స్‌పోర్టు వాహనాలను వినియోగిస్తున్నారు. స్థానిక రూట్లకు అనుగుణంగా వాహనాల వినియోగం వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు.
సర్వే ఇలా..
ఈ సర్వే చేసేందుకు వచ్చిన ఎన్యూమరేటర్లకు కుటుంబ సభ్యులు తమ పూర్తి వివరాలు చెప్పాలి. కుటుంబ సభ్యులతోపాటు తాత, ముత్తాతల వివరాలు సేకరించనున్నా రు. ఎన్యూమరేటర్ల వద్ద 80 అంశాలతో కూడిన నమూ నా ఫారం (25) అందుబాటులో ఉంటుంది. అందులో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేస్తారు. ఇందులో ముఖ్యంగా కులం, భూముల వివరాలు, సొంత ఇళ్లు, రేషన్‌కార్డు, పెన్షన్ పొందుతున్న వివరాలు తెలియజేయాలి.
దీంతోపాటు ఊరిలో అర్హులైన పేద ప్రజలు ఎం త మంది ఉన్నారు? ఎంత మందికి సొంత ఇళ్లు ఉన్నా యి? ప్రస్తుతం ఎంత మంది సంక్షేమ పథకాలు అందుతున్నాయనే వివరాలు స్పష్టంగా తెలిసిపోతాయి. సర్వే లో గ్రామ అధికారులతో పాటు మండలంలోని ప్రతి శా ఖ అధికారితోపాటు ఎంపీడీవోలు, తహశీల్దార్లు కలిపి సుమారు 18శాఖలకు చెందిన అధికారులు పాల్గొనున్నారు.
అయితే ఈ నెల 19న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కంపెనీలకు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఎలాంటి తప్పులు లేకుండా జవాబుదారితనంలో సమగ్రంగా సర్వే నిర్వహించాలని ఎన్యూమరేటర్లను, అధికారులను కలెక్టర్ జగన్మోహన్ ఇది వరకే ఆదేశించారు. ఇందులో భాగంగానే అధికారులకు, సిబ్బంది విడతలవారీ గా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సర్వేపై గ్రామీ ణ, పట్టణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్త్రృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఒకే రోజు.. ఆర్థిక, సామాజిక సర్వే
Published Thu, Aug 7 2014 12:50 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement