'నాది మెతక వైఖరి అనడం సరికాదు' | In my own style, says k jana reddy | Sakshi
Sakshi News home page

'నాది మెతక వైఖరి అనడం సరికాదు'

Published Wed, Mar 11 2015 7:19 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

'నాది మెతక వైఖరి అనడం సరికాదు' - Sakshi

'నాది మెతక వైఖరి అనడం సరికాదు'

హైదరాబాద్: తనది మెతక వైఖరి అనడం సరికాదని... ఎవరి శైలి వారిదేనని తెలంగాణ సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో హుందాగా తన శైలికి తగ్గట్లుగా వ్యవహరిస్తున్నాని తెలిపారు. బుధవారం హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎందుకు ఎండగట్టంలేదంటూ పార్టీ పెద్దలను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.

కేసీఆర్ ప్రభుత్వ వైఖరిపై మెతక వైఖరి సరికాదని పలువురు హస్తం నేతలు అభిప్రాయపడ్డారు. దీన్ని కాంగ్రెస్ అసమర్థగా ప్రజలు భావిస్తున్నారని సదరు పార్టీ పెద్దల వద్ద నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, సీఎం కేసీఆర్లను టార్గెట్ చేయాల్సిందే నంటూ నేతలు పార్టీ పెద్దలకు సూచించారు.

దీంతో అక్కడే ఉన్న కె.జానారెడ్డి.. నేతల వ్యాఖ్యాలపై పైవిధంగా స్పందించారు. అదికాక కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా కె.జానారెడ్డి అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్ పార్టీ విధానాలను ఎండగట్టకుండ... ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారిస్తున్నారంటూ సొంత పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement