ఇందిరమ్మ ఇళ్లకు
ఐఏవై కింద చెల్లింపులు
ఏప్రిల్ చివరినాటికి పూర్తయిన వాటికి చెల్లింపునకు కసరత్తు
ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్న సర్వే
బిల్లుల కోసం జిల్లాలో
7 వేల మంది లబ్ధిదారుల
ఎదురుచూపులు
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భువనగిరి, ఆలేరు సబ్ డివిజన్‌లలో గృహనిర్మాణ సంస్థ అధికారులు సర్వే చేపట్టారు. మార్చి 31 నాటికి భువనగిరి నియోజకవర్గంలో 202 , ఆలేరు నియోజకవర్గంలో 403 ఇళ్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ చివరి నాటికి భువ నగిరిలో మరో 135, ఆలేరులో 206 ఇళ్లు పూర్తి కానున్నాయి. ఇలా జిల్లావ్యాప్తంగా ఏప్రిల్ చివరి నాటికి 7వేల ఇందిరమ్మ ఇళ్లు పూర్తికానున్నాయి. వీరందరికీఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) కింద బిల్లులు ఇవ్వనున్నారు.
భువనగిరి : ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మించుకుని బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారిపై ప్రభుత్వం దయతలిచింది. అయితే ఇల్లు పూర్తిగా నిర్మించుకుని బిల్లు కోసం ఎదురుచూస్తున్న వారికి ఐఏవై( ఇందిరా ఆవాస్ యోజన) ద్వారా బిల్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మరో మారు విచారణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2014-15 సంవత్సరంలో జిల్లాలో ఐఏవై ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. కేంద్రంనుంచి వచ్చిన ఈ నిధులను ఇళ్ల నిర్మాణం కోసం వాడుకున్నట్లు యూసీ( యుటిలైజేషన్ సర్టిఫికెట్) కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. అప్పుడే 2015-2016 సంవత్సరానికి 10 శాతం అదనంగా పెంచి నిధులు మంజూరు ఇస్తారు. ఇందుకోసం స్పందించిన ప్రభుత్వం మరోసారి విచారణ జరిపి అర్హులైన వారికి బిల్లులు చెల్లించాలని కలెక్టర్‌ను ఆదేశించింది.
సర్వే ఇలా జరుగుతోంది..
జిల్లాలో గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని సీబీసీఐడీ చేత విచారణ జరిపించినవిషయం తెలిసిందే. ఇందులో అక్రమార్కులతో పాటు
అర్హులు ఇల్లు నిర్మించుకున్నారని తేలింది. వారంతా ఏడాది కాలంగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. మరోసారి సర్వే చేసి అర్హులైన వారికి బిల్లుల ఇవ్వాలని సీఎం కేసీఆర్ కలెక్టర్‌ను అదేశించారు. గృహనిర్మాణ సంస్థ అధికారులు ఇప్పటికే ఇళ్లు నిర్మాణ పూర్తి చేసుకున్న వారి జాబితాలను సిద్ధంగా ఉంచారు. ఆయా జాబితాలను గ్రామాల వారీగా తీసుకుని సర్వే కూడా ప్రారంభించారు. ప్రధానంగా ఒక డివిజన్ అధికారి మరో డివిజన్‌కు వెళ్లి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న వారి ఇంటికి వెళ్లి అర్హులను తేల్చాలి. ఆ జాబితాను కలెక్టర్‌కు సమర్పిస్తే మరో సారి రెవెన్యూ అధికారులతో రెండో విడత సర్వే జరిపి అప్పుడు అర్హులైన వారికి బిల్లులు చెల్లిస్తారు. ఇదంతా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
అసలేం జరిగిందంటే
గృహనిర్మాణశాఖలో సంవత్సర కాలంగా నూతన ఇళ్ల నిర్మాణాలకు మంజూరు లేదు. అయితే కేంద్రం ఐఏవై కింద ఇచ్చిన నిధులు ఇళ్ల నిర్మాణానికి ఖర్చు చేయకపోవడంతో మురిగిపోయే పరిస్థితి వచ్చింది. నిధులు ఖర్చు చేసి యుటిలైజేషన్ సర్టిఫికెట్ కేంద్రానికి పంపిస్తే తప్ప, వచ్చే సంవత్సరానికి నిధులు వచ్చే అవకాశం లేదు, ఉన్న నిధులను వాడుకోవడంతోపాటు కొత్త నిధులను 10 శాతం అదనంగా రాబట్టుకోవాలంటే వెంటనే ఆ నిధులను ఖర్చు చేసి యూటీ సర్టిఫికెట్ కేంద్రానికి సమర్పించాలి. అందుకోసం ఇప్పటికిప్పుడే అరుణాచలంలా డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి లేదు. దీంతో ఇందిరమ్మ ఇళ్లు మార్చి, ఏప్రిల్ నాటికి పూర్తయిన వారి వివరాలను సేకరిస్తున్నారు. మరో మూడు రోజులైతే ఈ నెల ముగుస్తుంది. అయితే ఇప్పటికే 7 వేలమంది అర్హులుగా తేలినట్లు తెలిసింది. వీరందరికీ బిల్లులు చెల్లించనున్నారు.
బిల్లులొస్తున్నాయ్!
Published Wed, Apr 29 2015 1:03 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement