పార్టీని పణంగా పెట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కేసీఆర్ విస్మరించటం సరికాదని మాజీమంత్రి, తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు.
హైదరాబాద్ : పార్టీని పణంగా పెట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కేసీఆర్ విస్మరించటం సరికాదని మాజీమంత్రి, తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించినప్పుడు సోనియా పేరు ప్రస్తావించకపోవటం విచారకరమని, అది కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. అసెంబ్లీ లోపలా, బయటా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ప్రజా సమస్యలపై సమిష్టిగా వ్యవహరిస్తామని జానారెడ్డి పేర్కొన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవటమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.