ఆ అద్భుతాలు 100 శాతం నిజమవుతాయి: కేసీఆర్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డికి అన్ని విచిత్రాలు, అద్భుతాలు కనిపిస్తున్నాయని ముఖ్యమత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం సభలో బడ్జెట్పై చర్చలో భాగంగా...అధ్యయనం చేసి బడ్జెట్ ఇచ్చినట్లు లేదు..సరైన లెక్కలు లేవన్న జానారెడ్డి వ్యాఖ్యలపై..ఆయన కౌంటర్ ఇచ్చారు.
ఇన్నాళ్లు మూసలో ఉన్నవారికి ఇప్పుడు ప్రతిదీ అద్భుతంగానే కనిపిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు కొట్లాడింది అద్భుత విజయాలు కోసమేనని కేసీఆర్ అన్నారు. 100 శాతం ఆ అద్భుతాలు నిజం అవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు విమర్శించేవాళ్లే...అప్పుడు ప్రశంసిస్తారని ఆయన పేర్కొన్నారు.