అన్నివర్గాల అభివృద్ధే కేసీఆర్ ధ్యేయం
అన్నివర్గాల అభివృద్ధే కేసీఆర్ ధ్యేయం
Published Wed, Mar 1 2017 12:58 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM
► ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
► కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
► అంగన్‌వాడీ కార్యకర్తల సంబరాలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్):
అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు జీతాలు పెంచడంతో మంగళవారం తెలం గాణ చౌరస్తాలో అంగన్‌వాడీలతో కలిసి ఎమ్మెల్యే సీఎం కే సీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలీచాలనీ జీతాలతో అనేక ఇబ్బందులు పడుతున్న అంగన్‌వాడీల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించారని చెప్పారు. గతంలో 6,500 పెంచారని, అది చాలదని 10,500 జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని అన్నారు. తమ ప్రభుత్వం ఫ్రేండ్లీ ప్రభుత్వమని అన్నారు. అంగన్‌వాడీలు బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావాలని కోరారు. జీతాలు పెంచాలని గతంలో పోరాటం చేసిన అంగన్‌వాడీలపై సమైక్య ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించారని గుర్తు చేశారు. అలాంటి తమ ప్రభుత్వంలో వారికి వేతనాలు పెంచి సమాజంలో వారికి తగిన గౌరం అందిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, జ్యోతి, వనజా, అంగన్‌వాడీ టీచర్ల, ఆయాలు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ రూరల్ : గతంలో ఎన్నడు లేని విధంగా సీఎం కేసీఆర్ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల హర్షం వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో జీవనం గడుపుతున్న తమను గుర్తించి సీఎం కేసీఆర్ అంగన్Sవాడీ కార్యకర్తకు రూ. 10,500, ఆయాకు రూ. 6వేలు వేతనం పెంచడం పట్ల సంబురాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వేతనాలు పెంచిన కేసీఆర్‌కు రుణపడి ఉంటామని అన్నారు.
తాము కోరుకుంటున్న పనికి తగ్గ వేతనం ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు. ప్రభుత్వం వేతనాలు పెంచడంతో పాటు డబుల్ బెడ్‌రూంల నిర్మాణానికి కూడా హామీని ఇవ్వడం పట్ల వారి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని అధికారుల వేధింపులు ఆపేలా చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు, ఆయాలు కోరుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అంగన్‌వాడీ సిబ్బందికి వేతనాలు పెంచడం ఇది రెండోసారి, గతంలో ఒకసారి ప్రభుత్వం వేతనాలు పెంచినా అంగన్‌వాడీ సిబ్బంది అసంతృప్తిగా ఉండడం వల్ల వారిలోని అసంతృప్తిని తొలగించేందుకు ప్రభుత్వం ఈసారి కార్యకర్తల, ఆయాల వేతనాలు పెంచింది. ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్త వేతనం రూ. 7వేలు, ఆయాకు రూ. 4500 ఉంది. జిల్లాలో 1889 అంగన్‌వాడీ కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న కార్యకర్తలు, ఆయాలకు ఈ వేతనాలు అందనున్నాయి.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
వేపూర్(హన్వాడ): మండల పరిదిలోని వేపూర్‌లో మంగళవారం అంగన్‌వాడీ కార్యకర్తలు తమకు వేతనాలు పెంచినందుకు గాను సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ శివరాజు, ఎంపీటీసీఎం స్వాతి, ఉపసర్పంచ్ మొగులమ్మ, అంగన్‌వాడీ కార్యకర్తలు కళావతి, విద్యావతి, కల్పన, అనిత, అంజమ్మ, వీరమణి, ఇంద్ర, ఇతర ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement