సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్లు అమ్ముకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఈ మేరకు సీఎం అనుమతితో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి కల్లు అమ్మాలని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగిలిన జిల్లాల్లో కల్లు విక్రయించేందుకు సీఎం కేసీఆర్ అనుమతినిచ్చారని, ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు.
గీత కార్మిక పక్షపాతిగా కేసీఆర్ మొదటి నుంచీ వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ఇప్పుడు కల్లు అమ్మకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 2.8 లక్షల మంది లైసెన్స్‌డ్ గీత వృత్తిదారులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. సమావేశంలో ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, గౌడ సంఘాల నేతలు పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్, బి.బాలరాజ్ గౌడ్, చింతల మల్లేశం గౌడ్, అంబాల నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment