
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 2:30 గంటలకు అపాయింట్‌మెంట్ ఖరారయినట్లు తెలిసింది. తెలంగాణలో నూతనంగా తీసుకొచ్చిన జోనల్ వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని మోదీని కేసీఆర్ కోరనున్నారు.
గతంలో దొరకని అపాయింట్‌మెంట్: వాస్తవానికి గత నెలలోనే సీఎం కేసీఆర్.. పీఎం మోదీని కలవాల్సింది. ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఏకంగా నాలుగు రోజులు అక్కడే మకాం వేశారు. కానీ ఎంతకీ ప్రధాని అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో హైదరాబాద్ వెనుదిరిగారు. అదే సమయంలో మోదీ.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment