'హైదరాబాద్లో సెక్షన్ 8 అవసరం లేదు' | kcr meets narasimhan | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్లో సెక్షన్ 8 అవసరం లేదు'

Published Mon, Jun 15 2015 5:18 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

'హైదరాబాద్లో సెక్షన్ 8 అవసరం లేదు' - Sakshi

'హైదరాబాద్లో సెక్షన్ 8 అవసరం లేదు'

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్‌ నరసింహన్‌తో గంటన్నర పాటు సమావేశమయ్యారు. సోమవారం మధ్యాహ్నం కేసీఆర్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిశారు. ఓటుకు నోటు కేసు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఓటుకు రూ.కోట్లు కేసు వివరాలను కేసీఆర్ గవర్నర్కు వివరించారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచనను నరసింహన్.. కేసీఆర్కు తెలిపినట్టు సమాచారం.  

గతేడాది కాలంలో హైదరాబాద్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగలేదని కేసీఆర్ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాల్సిన అవసరం లేదని కేసీఆర్ వివరించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అభిప్రాయాలను గవర్నర్ కేంద్రానికి తెలియజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement