కేసీఆర్ విద్వేషపు మాటలు తగవు: పవన్ | kcr should not speak foul, says pawan kalyan | Sakshi
Sakshi News home page

కేసీఆర్ విద్వేషపు మాటలు తగవు: పవన్

Published Thu, Aug 21 2014 11:47 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

kcr should not speak foul, says pawan kalyan

ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఇంకా విద్వేషపు మాటలు మాట్లాడటం అనవసరమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను మామూలుగానే అమిత్ షాను కలిశానని, గ్రేటర్ ఎన్నికలపై ఇంకా ఆలోచించలేదని ఆయన చెప్పారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ వాస్తవానికి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కలిసి చర్చించుకుంటే బాగుండేదని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆర్భాటపు మాటలు లేకుండా పనిచేస్తున్నారని, ఇచ్చిన హామీల మేరకే పనిచేస్తున్నారని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement