సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కరోనా నియంత్రణను, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ప్రజల్లో నెలకొన్న ఆందోళన తొలగిం చాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు. ఈమేరకు ఆయన సీఎం కేసీఆర్ కు మంగళవారం లేఖ రాశారు. తెలంగాణతో స హా కొన్ని రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ జంట నగరాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందన్నారు. దీనిపై ప్రజల్లో అభద్రతాభావం, భయం అధికంగా ఉన్నట్లు అర్థమవుతోందని, ప్రజల్లో నెలకొన్న ఈ ఆందోళనలను దూరం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతీసూదన్ సోమవారం దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల అధికారులతో మాట్లాడార ని, ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా వైద్యాధికారి, ప్రధాన వైద్యశాలల సూపరింటెండెంట్లు, రాష్ట్ర వైద్యశాఖ కార్యదర్శితో మాట్లాడారని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చేపట్టాల్సిన సూచనలు చేశారని, వాటిని పక్కాగా అమలుచేయాలన్నారు. ఇంటింటి సర్వే చేపట్టి సకాలంలో రోగులను గుర్తించి, సత్వరం పరీక్షలు చేసి, బాధితులకు చికిత్స అందించాలని కోరారు.
కట్టడి చర్యలు పటిష్టం చేయండి: వైద్య, ఆరోగ్య సిబ్బందికి సహాయంగా ఉండేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంస్థలు ఏర్పాటు చేయడంతోపాటు కంటైన్మెంట్ జోన్లలో ప్రభుత్వ సిబ్బంది, వైద్య రంగ ప్రముఖు లను నియమించాలని కిషన్‌రెడ్డి కోరారు. జంటనగరాల్లో వీధుల్ని, కరోనా వచ్చిన గృహాలను యం త్రాల ద్వారా శానిటైజ్ చేయాలన్నారు. కరోనా కట్టడిలో భాగంగా..వారియర్స్‌గా పనిచేస్తున్న సి బ్బంది రక్షణ చర్యలు తీసుకుంటూ వారికి ఆత్మవిశ్వాసం కల్పించాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలో నమూనా పరీక్షలు అధికం చేస్తూ పరీక్షల ఫలితాలు త్వరగా వచ్చేలా చూడాలని పేర్కొన్నారు.
లక్ష్మణ్‌కు అటల్ ఫౌండేషన్ ప్రశంసాపత్రం: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ లాక్‌డౌన్ సమయంలో చేసిన సేవలకుగాను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని అటల్ ఫౌండేషన్ తరఫున ప్రశంసా పత్రం పంపించిందని బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో వ్యక్తులు, సంస్థలు చేసిన సేవలను గుర్తించి అటల్ ఫౌండేషన్ ప్రశంసలు అందజేస్తుందని తెలిపారు.
కరోనాపై ప్రజల్లో ఆందోళన తొలగించండి
Published Wed, Jun 10 2020 5:18 AM | Last Updated on Wed, Jun 10 2020 5:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment