కిరీటాలు..పీఠాలు అడగడం లేదు: కోదండరాం | kodandaram fires on trs leaders | Sakshi
Sakshi News home page

కిరీటాలు..పీఠాలు అడగడం లేదు: కోదండరాం

Published Wed, Jun 21 2017 8:30 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

కిరీటాలు..పీఠాలు అడగడం లేదు: కోదండరాం - Sakshi

కిరీటాలు..పీఠాలు అడగడం లేదు: కోదండరాం

సంగారెడ్డి జిల్లా: తెలంగాణ ప్రభుత్వంపై టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం నిప్పులు చెరిగారు.  ‘నెత్తి మీద కిరీటాలు.. కింద పీఠాలు.. దండలు కోరుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని మాత్రమే ప్రశ్నిస్తున్నం’అని కోదండరాం అన్నారు. తెలంగాణ జేఏసీ చేపట్టిన ‘అమరుల స్ఫూర్తియాత్ర’ను బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కోదండరాం మాట్లాడుతూ ‘తెలంగాణ వచ్చింది.. నువ్వెవరు? అని అడుగుతున్నారు.. అయినా మేం గుర్తింపు కోరుకోవడం లేదు’అన్నారు. ‘లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ ఎక్కడికి పోయింది. రైతు ఆత్మహత్యల్లో రెండోస్థానం, నిరక్షరాస్యతలో అట్టుడుగున ఉన్నాం. దళితులకు ఇప్పుడు ఇస్తున్నట్లే భూమి పంపిణీ చేస్తే.. అందరికీ లబ్ధి కలగాలంటే ఇంకో 230 ఏళ్లు పడుతుంది. ఇదేం పద్ధతి.. మీకు అవసరమైతే భూములు దొరుకుతున్నాయి. మియాపూర్‌ భూములు పంచుకోవడం, కాంట్రాక్టులు తెచ్చుకోవడం, పైసలు దండుకోవడంలోనే నాయకులు మునిగి తేలుతున్నారు. ఎవరిపైనైతే కొట్లాడినమో.. వారికే పైసలు దొరుకుతున్నయి. ఓట్లు అడిగేందుకు మాత్రమే ప్రజలు అక్కరకు వస్తారా..? మన వల్లే ప్రభుత్వం పుట్టింది’అని కోదండరాం ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పాం. మూడేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా.. 20 వేల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఐదు రూపాయల భోజనం తింటూ నిరుద్యోగులు పరీక్షలకు సిద్ధమవుతున్నా.. ఒక్క ఉద్యోగానికి కూడా సక్రమంగా నోటిఫికేషన్‌ ఇవ్వడం లేదు’అని కోదండరాం విమర్శించారు. డబ్బులుంటే వైద్యం అందడం లేదు. గ్రామాల్లో వృత్తుల మీద ఆధారపడిన వారికి ఆదాయం లేదు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement