60 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి నీటి ప్రవాహాలు పుంజుకున్నాయి. గురువారం నాటికి రోజుకు 6 టీఎంసీల చొప్పున 64 వేల క్యూసెక్కుల మేర నీరు వచ్చిచేరుతోంది. దీంతో ప్రాజెక్టు మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 129 టీఎంసీలకు గాను 58.6 టీఎంసీలకు చేరింది. ప్రవాహాలు పెరగడంతో 27,720 క్యూసెక్కుల నీటిని దిగువ నారాయణపూర్‌కు వదులుతున్నారు.
దీంతో నారాయణపూర్‌కు 10,735 క్యూసెక్కుల మేర ప్రవాహం ఉండటంతో అక్కడ 37.64 టీఎంసీల నిల్వకు 15.87 టీఎంసీల నిల్వ ఉంది. ఇక తుంగభద్రకు సైతం ప్రవాహాలు పెరిగాయి. దీనికి 15,464 క్యూసెక్కుల మేర నీరు చేరుతోంది. ప్రస్తుతం ఎగువ కర్ణాటకలో మంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరో 15 రోజుల తర్వాత దిగువ జూరాలకు ప్రవాహాలు మొదలయ్యే అవకాశముంది.
ఆల్మట్టికి రోజుకు 6 టీఎంసీలు
Published Fri, Jul 21 2017 1:39 AM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM
Advertisement