
సాక్షి, హైదరాబాద్: నిస్సహాయులకు సహాయపడి వారి ముఖాలపై చిరునవ్వులు తీసుకురావాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ నేతలు, కేడర్‌కు పిలుపునిచ్చారు. ఈ నెల 24న తన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటనలు, హోర్డింగ్‌లు, పూల బొకేల కోసం అనవసర ఖర్చులు చేయొద్దని ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు. కాగా, చంద్రయాన్–2ను విజయవంతంగా కక్ష్యలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రయోగం తో భారత్ తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందని, ఈ క్షణం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణంగా అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment