దేశంలో ఇంటర్‌నెట్‌ వినియోగం పెరిగింది : కేటీఆర్‌ | KTR Video Conference With Central IT Minister Ravi Shankar Prasad | Sakshi
Sakshi News home page

సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టండి : కేటీఆర్‌

Published Tue, Apr 28 2020 6:39 PM | Last Updated on Tue, Apr 28 2020 6:45 PM

KTR Video Conference With Central IT Minister Ravi Shankar Prasad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున ఇంటర్‌నెట్‌ వినియోగం పెరిగిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ రంగాల్లో నూతన ఉపాధి అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. మంగళవారం రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులతో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు మినహాయింపులు ఇవ్వాలని ఆయన కోరారు. కేటీఆర్ మాట్లాడుతూ.. వివిధ రంగాల కన్వర్జెన్స్ ద్వారా అనేక కొత్త అవకాశాలు రానున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ రంగంలో నూతన అవకాశాలుంటాయన్నారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్రాలు ముందుకు కదలాలని సూచించారు. తెలంగాణకు మరో రెండు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement