ప్రారంభమైన లాల్‌దర్వాజా ఉత్సవాలు
చాంద్రాయణగుట్ట:చారిత్రాత్మతకమైన లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి ఆలయంలో 106వ వార్షిక బ్రహోత్మవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్ దంపతులు నిర్వహించిన దేవి అభిషేకంతో ఉత్సవాలు మొదలయ్యాయి.
ఉదయం 11 గంటలకు నగర్ పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి, అదనపు కమిషనర్ అంజనీ కుమార్, జాయింట్ కమిషనర్ మల్లారెడ్డి, దక్షిణ మండలం డీసీపీ ఎస్‌ఎస్ త్రిపాఠి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆలయం పెకైక్కి శిఖర పూజ చేశారు. అనంతరం ధ్వజారోహణ చేశారు. సాయంత్రం 6.15 గంటలకు కలశ స్థాపన జరిగింది.
దేవి ఉపాసకులు దైవజ్ఞశర్మ, లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ బి.బల్వంత్ యాదవ్, మాజీ చైర్మన్లు కె.విష్ణుగౌడ్, బంగ్లా రాజు యాదవ్, రంగ రమేశ్ గౌడ్, సలహా కమిటీ చైర్మన్ జి.మహేశ్‌గౌడ్, కోశాధికారి టి.నర్సింగ్ రావు, ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్, గౌలిపురా కార్పొరేటర్ ఆలే జితేంద్రతోపాటు ఆలయ కమిటీ సభ్యులు బీఆర్ సదానంద్ ముదిరాజ్, పోసాని సదానంద్ ముదిరాజ్, మాణిక్ ప్రభుగౌడ్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ ఎం.బాలసుబ్రహ్మణ్యం రెడ్డి పాల్గొన్నారు.