
మొబైల్ లైట్ల వెలుగులో లోకసభ స్పీకర్ ప్రసంగం
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని జాంబాగ్‌లోని వివేకవర్థిని పాఠశాల శతాబ్ది ఉత్సవాల్లో లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ పాల్గొన్నారు. అయితే ఆమె వేదిక పై కూర్చున్న సమయంలో విద్యుత్ అంతరాయం కలగడంతో సెల్‌ఫోన్‌ల వెలుతురులోనే స్పీకర్ ప్రసంగం ప్రారంభించారు. కొన్ని నిమిషాల అనంతరం విద్యుత్ సరఫరా అవడంతో సుమిత్ర మహాజన్ తన ప్రసంగం కొనసాగించారు.