వలస కూలీల యోగక్షేమాలపై కేటీఆర్‌ ఆరా.. | Minister KTR Visited The Camps Of Migrant Workers | Sakshi
Sakshi News home page

వలస కూలీల క్యాంపులను సందర్శించిన కేటీఆర్

Published Mon, Apr 13 2020 4:57 PM | Last Updated on Mon, Apr 13 2020 7:15 PM

Minister KTR Visited The Camps Of Migrant Workers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని వలసకూలీల యోగక్షేమాలను పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు(కేటీఆర్‌) అడిగి తెలుసుకున్నారు. సోమవారం గచ్చిబౌలిలోని ఒక నిర్మాణ సంస్థ  సైట్‌లో పని చేసేందుకు వచ్చిన సుమారు 400 మంది ఉన్న క్యాంపుని మంత్రి సందర్శించారు. ఈ క్యాంప్‌లో ఒరిస్సా, బెంగాల్, బీహార్  పలు రాష్ట్రాలకు చెందిన కూలీలు ఉన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగించిన నేపథ్యంలో అందరూ నిబంధనలు పాటించాలని కోరారు.

లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం పనులు లేకపోవడంతో కార్మికులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.వారికి అందుతున్న ఆహారం, రేషన్‌ సరుకుల గురించి ప్రత్యేకంగా వాకబు చేశారు. త్వరలోనే కరోనా మహమ్మారి సంక్షోభం తొలగిపోతుందని వారికి ధైర్యం చెప్పారు. అప్పటి వరకు బయటికి వెళ్లకుండా క్యాంప్‌లోనే ఉండాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. వలస కూలీలకు ఈ రెండు వారాల పాటు వారికి కనీస అవసరాలను తీర్చాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులతో పాటు స్థానిక అధికారులను మంత్రి కేటీఆర్ సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement